Akunuri Murali : ప‌ల్లా కామెంట్స్ ఆకునూరి సీరియ‌స్

బీఆర్ఎస్ లో రెడ్ల‌కే ప్రాధాన్య‌త

Akunuri Murali : సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోర‌మ్ చీఫ్ , మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి(Akunuri Murali) నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. రైతు వేదిక చైర్మ‌న్, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి రెడ్ల సామాజిక వ‌ర్గానికి సంబంధించి చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. కులాల పేరుతో ఇలా రాజ‌కీయం చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. భార‌త రాజ్యాంగం సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వీరు ఇలా బ‌హిరంగంగా త‌మ కులం గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌డం దారుణ‌మన్నారు.

ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని మండిప‌డ్డారు ఆకునూరి ముర‌ళి. ఇప్ప‌టికే రాష్ట్రంలో పాల‌న ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని, జ‌వాబుదారీత‌నం లేకుండా పోయింద‌న్నారు. ఎవ‌రి కోసం స‌చివాల‌యం క‌ట్టుకున్నారో దొర‌కే తెలియాల‌ని మండిప‌డ్డారు. సిగ్గు లేకుండా ప‌ల్లా లాంటి వాళ్లు కుల ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని , ఆర్థిక దోపిడీకి పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆకునూరి ముర‌ళ‌ఙ‌. ఇలాంటి దోపిడీదారుల‌ను త‌న్ని, త‌రిమి కొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.

తెలంగాణ సంప‌ద‌ను అక్ర‌మంగా కొల్ల‌గొట్ట‌డ‌మే కాకుండా పేద‌రికాన్ని పెంచి పోషిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతం అయిన రోజున మీ ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి కుల పిచ్చితో వాగుతున్న వాళ్ల‌కు స‌రైన రీతిలో బుద్ది చెప్పాల‌న్నారు ఆకునూరి ముర‌ళి.

Also Read : Jio Mart Lay Offs

 

Leave A Reply

Your Email Id will not be published!