Akunuri Murali : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టండి
పిలుపునిచ్చిన ఆకునూరి మురళి
Akunuri Murali : తెలంగాణ – సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) కన్వీనర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి(Akunuri Murali) సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగో (మేలుకో) తెలంగాణ పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్రమంతటా ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు ఆకునూరి మురళి.
Akunuri Murali Serious Comments On KCR
వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వెనకేసుకున్న గజ దొంగ కేసీఆర్ అని మండిపడ్డారు. ఇకనైనా ప్రజలు మేలు కోవాలని లేక పోతే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ఆవేదన చెందారు.
సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వస్తున్న కేసీఆర్ కు చుక్కలు చూపించాలని పిలుపునిచ్చారు. అంతులేని అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని అన్నారు ఆకునూరి మురళి.
ఇదే సమయంలో నీటి పారుదల శాఖ కమిషన్ చైర్మన్ గా ఉన్న వి. ప్రకాశ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ ఇలా ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారంటూ నిలదీశారు ఎస్డీఎఫ్ కన్వీనర్.
Also Read : TTD Chairman : ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు