Akunuri Murali TS Schools : తెలంగాణ బడుల్లో పంతుళ్లేరి – మురళి
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఆకునూరి
Akunuri Murali TS Schools : ఎస్డీఎఫ్ కన్వీనర్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. ఆయన సీఎం కేసీఆర్ ను, రాష్ట్రంలో సాగిస్తున్న పాలనపై విమర్శలు కురిపిస్తున్నారు. గత కొంత కాలంగా ఆకునూరి మురళి ప్రజల గొంతుకగా మారారు. ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ ముందుకు వెళుతున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ సాగిస్తున్న పాలన అస్తవ్యస్తంగా మారిందంటూ మండిపడ్డారు. గాడి తప్పిన పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఏ అధికారి ఎప్పుడు పని చేస్తున్నారో దేని కోసం నియమింపబడ్డారో తెలియకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు ఆకునూరి మురళి(Akunuri Murali TS Schools) .
ఆయన ప్రధానంగా రాష్ట్రంలో బడులు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. తెలంగాణలో 6,392 ప్రభుత్వ బడులలో ఒక్క టీచర్ 5 తరగతులకు పాఠాలు చెబుతున్నారని ఇలాగైతే విద్య ఎలా పిల్లలకు అందుతుందని ప్రశ్నించారు. మౌలిక వసతులు లేవని, పెద్ద ఎత్తున బడుల్లో ఖాళీలు ఉన్నాయని ఇప్పటి వరకు డీఎస్సీ నిర్వహించలేదని సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో సగటున సింగిల్ టీచర్ బడులు 10 శాతం ఉంటే తెలంగాణలో 21 శాతం ఉన్నాయి. ఇంతే స్థాయిలో ఒక్క రూమ్ ఉన్న బడులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కావాలని కేసీఆర్ నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు ఆకునూరి మురళి. ప్రతిసారి పదే పదే బంగారు తెలంగాణ అని ప్రకటించే సీఎం కేసీఆర్ బడుల గురించి, విద్య గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు .
Also Read : కరెంట్ కష్టం కేసీఆర్ మోసం – రేవంత్