Al-Qaeda Links : అస్సాంలో అల్ ఖైదా ఉగ్ర‌వాదులు అరెస్ట్

గోల్ ప‌రాలో వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్న పోలీసులు

Al-Qaeda Links :  అస్సాంలోని గోల్ ప‌రాలో అల్ ఖైదాతో సంబంధాలు క‌లిగిన ఇద్ద‌రు అనుమానిత ఉగ్ర‌వాదుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారికి అంతర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధం ఉందని స్ప‌ష్టం చేశారు.

అస్సాం పోలీసులు ఇటీవ‌ల బార్ పేట‌, మోరిగావ్ జిల్లాల్లో ఛేదించిన‌ట్లు గోల్ ప‌రా ఎస్పీ వెల్ల‌డించారు. గోల్ ప‌రా లోని మ‌సీదులో ఇమామ్ లుగా చెలామ‌ణి అవుతున్న అబ్దుస్ సుభాన్ , జ‌లాలుద్దీన్ షేక్ లుగా గుర్తించిన‌ట్లు తెలిపారు.

అల్ ఖైదా తో పాటు బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ అన్స‌రుల్లా బంగ్లా టీం (ఏబీటీ) తో సంబంధం ఉన్న ఇద్ద‌రు అనుమానితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు.

పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుండి వ‌చ్చిన జిహాదీల‌కు నిందితులు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని, ఆపై వారికి ఆశ్ర‌యం క‌ల్పించార‌ని ప్ర‌క‌టించారు ఎస్పీ వివి రాకేశ్ రెడ్డి.

వారు అల్ ఖైదాలో(Al-Qaeda Links) స‌భ్యులుగా ఉన్నార‌ని జిల్లాల్లో స్లీప‌ర్ సెల్స్ ను రిక్రూట్ మెంట్ చేసిన‌ట్లు ఒప్పుకున్నార‌ని మీడియాకు తెలిపారు. టెర్ర‌ర్ మాడ్యుల్స్ తో ప్ర‌త్య‌క్ష సంబంధం ఉంద‌న్నారు.

అరెస్ట్ అయిన అబ్బాస్ అలీ నుండి జిహాదీ అంశాల‌తో కూడా సంబంధం క‌లిగి ఉన్నాడ‌ని తెలిపారు. విచార‌ణ‌లో అస్సాం లోని అల్ ఖైదా, ఏబీటీతో క‌లిపి బార్ పేట‌, మోరిగావ్ మాడ్యుల్స్ తో నేరుగా సంబంధం క‌లిగి ఉన్న‌ట్లు తేలింద‌న్నారు ఎస్పీ.

నిందితుల ఇళ్ల‌ల్లో సోదాలు చేప‌ట్టామ‌ని ఫోన్లు, సిమ్ కార్డులు, ఐడీ కార్డుల‌తో పాటు అల్ ఖైదా, జిహాదీ అంశాల‌కు సంబంధించిన నేరారోప‌ణ‌లు, పోస్ట‌ర్లు, పుస్త‌కాలు, ఇత‌ర ప‌త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు.

Also Read : యూపీ గ్యాంగ్ రూ. 500 కోట్ల‌కు టోక‌రా

Leave A Reply

Your Email Id will not be published!