KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనం కలిగించింది. నిన్న వనపర్తి వేదికగా జరిగిన బహిరంగ సభ సాక్షిగా నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెబుతానని ప్రకటించారు.
దీంతో కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారంటూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 2022-23 సమావేశాల సందర్భంగా నిరుద్యోగులకు సంబంధించి తీపి కబురు చెపుతానని(KCR )ప్రకటించారు.
శాసనసభ సాక్షిగా కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ వెల్లడించింది.
ఈ రోజు వరకు జాబ్స్ నోటిఫికేషన్ ఇవ్వక పోవడంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీలతో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు సైతం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశాయి.
జాబ్స్ నోటిఫికేషన్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేక నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉండగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.
వేతన సవరణ సంఘం నివేదిక ఆధారంగా లక్షా 92 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉద్యోగాలతో పాటు ఇప్పటి వరకు వేలాది మంది పని చేస్తున్న కాంట్రాక్టు పోస్టులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
గడిచిన మూడు ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదు. కొత్త జోనల్ పూర్తి కావడంతో జాబ్స్ ఖాళీల పరిస్థితి ప్రభుత్వానికి అందింది.
Also Read : నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త