MLC Kavitha Case : అంద‌రి చూపు కల్వ‌కుంట్ల క‌విత వైపు

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఆరోప‌ణ‌లు

MLC Kavitha Liquor Case : దేశ వ్యాప్తంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హాట్ టాపిక్ గా మారారు. కొన్ని కోట్లు ఖ‌ర్చు చేసినా రాని ప్ర‌చారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ, సీబీఐ పుణ్య‌మా అని సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

ప్ర‌స్తుతం క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆమె ప్ర‌ధాన పాత్ర పోషించింద‌ని ఇప్ప‌టికే త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యేక కోర్టులో ప‌దే ప‌దే క‌విత(MLC Kavitha Liquor Case) పేరును ప్ర‌స్తావించింది.

ఈ స్కాంకు సంబంధించి క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్రంగా స్పందించారు. త‌న‌పై ఎవ‌రూ ఆరోప‌ణ‌లు చేయ‌కుండా ఉండేందుకు ముంద‌స్తుగా కోర్టుకు వెళ్లారు. ఎవ‌రు మాట్లాడినా ఊరుకోనంటూ హెచ్చ‌రించారు. ఆపై బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ను చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాయి. 10 ఫోన్లు వాడింద‌ని, వాటిని ధ్వంసం చేసింద‌ని, సౌత్ గ్రూప్ లో కీల‌క పాత్ర పోసించిందని, రూ. 100 కోట్లు చేతులు మారాయ‌ని ఆరోపించింది. దీంతో నివ్వెర పోయింది ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha). ఈ సంద‌ర్భంగా కొత్త రాగం అందుకున్నారు. 

కేంద్రం కావాల‌ని త‌న తండ్రిని ఇరికించేందుకు త‌న‌ను పావుగా వాడుకుంటోందంటూ ఆరోపించారు. ఆపై మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పెట్టాలంటూ ఢిల్లీలో మార్చి 10న దీక్ష చేప‌ట్టారు. మార్చి 15న రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేశారు. 

మార్చి 16న ఈడీ ముందుకు హాజ‌రు కావాల్సి ఉండ‌గా డుమ్మా కొట్టారు. మొద‌ట అనారోగ్యం అన్నారు. ఆ త‌ర్వాత వేధింపుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఈడీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఆమె ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబు , వ్యాపార‌వేత్త అరుణ్ రామ‌చంద్ర పిళ్లై ని అరెస్ట్ చేసింది. దీంతో ఇవాళ క‌విత హాజ‌ర‌వుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : పిళ్లై..ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ జ‌రిగేనా

Leave A Reply

Your Email Id will not be published!