Ayyanna Patrudu : జగన్ పాలనలో కంపెనీలన్నీ జంప్
చివరకు అండర్ వేర్ కంపెనీ కూడా
Ayyanna Patrudu : ఏపీలో ఏం ఉన్నాయని చెప్పుకోవడానికి అన్ని కంపెనీలు అవుట్ అన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ను కూడా ఏకి పారేశారు. ఇంకో వైపు ఏపీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ కోసం అందరూ రావాలి..కష్టపడి పని చేయాలన్నారు. గంటా ఒక్కడే మొగోడు కాదన్నారు. టీడీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అన్నారు. కష్ట కాలంలో రాని నాయకులు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ మెల మెల్లగా వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu).
గంటా మాజీ మంత్రి అయి ఉండవచ్చు..కానీ టీడీపీకి ఉన్న లక్ష మందిలో ఆయన ఒకడు అని మండిపడ్డారు. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇన్ని రోజులు ఇంట్లో దాక్కున్న వాళ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు.
పార్టీ కష్ట సమయంలో ఏ ఒక్కరు ముందుకు రాలేదని మండిపడ్డారు అయ్యన్న పాత్రుడు. అధికారంలో ఉన్నా లేకున్నా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని, ఎల్లప్పటికీ ఉంటారని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో సాఫ్ట్ వేర్ ..హార్డ్ వేర్ కంపెనీలే కాదు అండర్ వేర్ కంపెనీలు కూడా ఏపీ నుంచి వెళ్లి పోయాయని ఎద్దేవా చేశారు.
జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ తీసుకు పోయారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అయ్యన్న పాత్రుడు.
Also Read : వాటాల కోసమే సీఎంలు వచ్చిండ్రు