Khatkar Kalan : యావత్ భారతమంతా ఇప్పుడు ఖట్కర్ కలాన్ వైపు చూస్తోంది. భారత దేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన విప్లవ వీరుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్ స్వంత ఊరు పంజాబ్ లోని ఖట్కర్ కలాన్(Khatkar Kalan ).
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒక్కసారిగా ఈ ఊరికి మరోసారి ప్రాచుర్యం తీసుకు వచ్చేలా చేశాడు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గాను 92 స్థానాలలో అఖండ విజయాన్ని నమోదు చేసింది.
ఈ సందర్భంగా 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను తిరగ రాసింది ఆప్. ఈ సందర్భంగా గెలుపొందిన వెంటనే ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ను ఎన్నికల కంటే ముందే ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
కమెడియన్ గా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా, సాధారణ మానవుడిగా పేరొందారు భగవంత్ మాన్. ఆయన ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు.
తాజాగా ధురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ తేడాతో ఘన విజయం సాధించారు భగవంత్ మాన్. తాజాగా సంచలన ప్రకటన చేశారు.
ఇక నుంచి రాష్ట్రంలో సీఎం ఫోటో కానీ పీఎం ఫోటో కానీ ఉండదన్నాడు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలు ఉంటాయని స్పష్టం చేశాడు.
ఇక పంజాబ్ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు మాన్. సీఎం ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ లో కాకుండా భగత్ సింగ్ పుట్టిన ఖట్కర్ కలాన్(Khatkar Kalan )లో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టి విస్తు పోయేలా చేశాడు మాన్.
ప్రస్తుతం అన్ని దారులు ఖట్కర్ కలాన్ వైపు మళ్లాయి.
Also Read : పీసీసీ చీఫ్ లకు మేడం బిగ్ షాక్