Sanjay Raut : అందరి చూపు సంజయ్ రౌత్ వైపు
మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం
Sanjay Raut : మరాఠా అనే సరికల్లా శివసేన గుర్తుకు వస్తుంది. ఆ పార్టీ అంటేనే ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) గుర్తుకు రాక తప్పదు. ఎందుకంటే ఆయన కామెంట్స్ కలకలం రేపుతాయి. మాటల తూటాలు పేల్చుతూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టించేలా చేస్తుంటారు.
ప్రస్తుతం మరోసారి ఆయన రాజ్యసభ ఎంపీ ఎన్నికల బరిలో ఉన్నారు. శుక్రవారం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు గంటల తర్వాత ఫలితాలను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇక ఊహించని విధంగా ఈసారి ఎంఐఎం శివసేన సంకీర్ణ సర్కార్ మహా వికాస్ అఘాడీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ జలీల్ వెల్లడించారు.
ఈ తరుణంలో ఎవరు గెలిచినా ప్రధానంగా అందరి దృష్టి మాత్రం శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , సామ్నా పత్రిక గౌరవ సంపాదకుడిగా ఉన్న సంజయ్ రౌత్ పైనే ఉంది.
ఆయన గత కొంత కాలం నుంచీ బీజేపీని, దాని అనుబంధ సంఘాలను, కేంద్రాన్ని, మోదీ, అమిత్ షాను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆయనను ఓడించేందుకు పావులు కదుపుతోంది.
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర ఒకటి. ఇక రాష్ట్రం నుంచి ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పీయూష్ గోయల్ , అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ బరిలో ఉన్నారు.
ఎన్సీపీ నుంచి ప్రపుల్ పటేల్ , శివసేన నుంచి సంజయ్ రౌత్(Sanjay Raut) , సంజయ్ పవార్ , కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్ గఢి పోటీ పడుతున్నారు. నలుగురు అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు సంజయ్ రౌత్.
Also Read : అన్ని సీట్లు మేమే గెలుస్తాం – అస్లాం షేక్