Nadav Lapid : ముమ్మాటికీ కాశ్మీర్ ఫైల్స్ ప్ర‌చార‌మే

నాద‌వ్ లాపిడ్ కు జ్యూరీ మెంబ‌ర్స్ స‌పోర్ట్

Nadav Lapid : వివేక్ అగ్నిహోత్రి తీసిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ త‌క్కువ ఖ‌ర్చుతో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇదిలా ఉండగా గోవాలో ఇటీవ‌ల జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో జ్యోరీ చీఫ్ , ఇజ్రాయెల్ నిర్మాత‌, ఫిల్మ్ మేక‌ర్ నాద‌వ్ లాపిడ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమానే కాద‌ని, ఇది కేవ‌లం ప్ర‌చారం కోసం ఉప‌యోగించు కున్నారంటూ ఆరోపించారు.

అంతే కాదు ఇందులో క‌థే లేద‌ని పేర్కొన్నాడు. నాద‌వ్ లాపిడ్(Nadav Lapid) చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌కలం రేపాయి. మొత్తం 15 మంది స‌భ్యులు క‌లిగిన జ్యూరీలో కొంద‌రు విభేదించ‌గా మ‌రికొంద‌రు మ‌ద్ద‌తుగా నిలిచారు. ప్ర‌తిప‌క్షాలు సైతం తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి.

ఇదిలా ఉండ‌గా తాను తీసిన సినిమాలో వాస్త‌వాలే ఉన్నాయ‌ని, అవి అవాస్త‌వాలంటూ నిరూపిస్తే తాను ఇక సినిమాల నుంచి త‌ప్పుకుంటున్నాంటూ ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి. ఓ వైపు మ‌ద్ద‌తుదారులు మ‌రో వైపు విమ‌ర్శ‌కులు త‌మ కామెంట్స్ కు ప‌దును పెట్టారు.

ఆదివారం ఇజ్రాయెల్ నిర్మాత నాదెవ్ లాపిడ్ కు మ‌ద్ద‌తుగా జ్యూరీ స‌భ్యుల‌లో ముగ్గురు మ‌ద్ద‌తు తెలిపారు. నాదెవ్ చేసిన కామెంట్స్ స‌రైన‌వేనని, ది కాశ్మీర్ ఫైల్స్ లో ఎలాంటి సరుకు లేద‌ని, ముమ్మాటికీ కాశ్మీర్ ఫైల్స్ ప్ర‌చార‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇందుకు సంబంధించి ఫిఫా జ్యూరీ స‌భ్యులు పాస్కేల్ చ‌వాన్స్ , జేవియ‌ర్ అంగులో బార్టెరెన్ లు పేర్కొన్నారు. అయితే కాశ్మీరీ పండిట్ ల విషాదాన్ని తిర‌స్క‌రించ‌డం త‌న ఉద్దేశం కాద‌ని, సినిమాకు సంబంధించి పెద్ద ప్ర‌చారం త‌ప్ప ఇంకేమీ లేద‌న్నారు.

Also Read : ‘జ‌క్క‌న్న‌’కు అరుదైన పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!