Alla Ramakrishna Reddy : వైసీపీకి షాక్ ఎమ్మెల్యే రాజీనామా
ప్రకటించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి
Alla Ramakrishna Reddy : అమరావతి – అధికారంలో ఉన్న వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో కీలక నేతగా ఉంటూ వచ్చారు. తన వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు తన రాజీనామా లేఖను అందజేశారు.
Alla Ramakrishna Reddy Resigned
వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి శాసన సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుపై గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవిని ఆశించారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి(Alla Ramakrishna Reddy). ఇదే సమయంలో రెండుసార్లు మంత్రివర్గాన్ని మార్చారు. రెండు దఫాలలో తనకు చోటు దక్కక పోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.
తాను పార్టీ పదవికి రాజీనామా చేసిన ఆయన పార్టీని కూడా వీడుతున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలు జరగబోయే వేళ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బగా భావించాల్సి ఉంటుంది. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.
Also Read : Kishan Reddy : పర్యాటక రంగ అభివృద్దికి కృషి
