Shashi Tharoor : ఆరోపణలు అబద్దం విమర్శలు అవాస్తవం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలన కామెంట్స్
Shashi Tharoor : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. బుధవారం శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. తాను పార్టీలో కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్నానని చెప్పారు.
తాను ప్రాతినిధ్యం వహించే నియోకవర్గంలో తాను పర్యటించే హక్కు తనకు ఉంటుందన్నారు. దీనిని అర్థం చేసుకోకుండా రాజకీయాలు చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు తెలియవన్నారు శశి థరూర్(Shashi Tharoor). తాను, ఎంకే రాఘవన్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కొందరు మీడియాకు ఎక్కడం తనను బాధకు గురి చేసిందన్నారు.
ఈ సందర్బంగా తనను విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు శశి థరూర్. ఇదిలా ఉండగా ఇవాళ కేరళలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ ఎంకే రాఘవన్ హాజరు కావడం కలకలం రేపింది కేరళ పార్టీలో.
కాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పార్టీలో ఎలాంటి మత విద్వేసాలు లేదా సమాంతర కార్యకలాపాలు అనుమతించ బోమంటూ హెచ్చరించారు. ఈ కామెంట్స్ కేవలం ఎంపీ శశి థరూర్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవేనని తేలి పోయింది. దీనిపై సీరియస్ గా స్పందించారు శశి థరూర్.
తాము పార్టీలో కీలకంగా ఉన్నామని ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అంతకు ముందు శశి థరూర్ తలస్సేరి ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పాంప్లనీని కలిశారు. అనంతరం కన్నూర్ లో మీడియాతో మాట్లాడారు.
Also Read : ప్రధానిని ఎన్నికల సంఘం ఎదుర్కోగలదా