Amaravathi Farmers: రాజధాని దీక్షా శిబిరాలకు ముగింపు పలికిన అమరావతి రైతులు !
రాజధాని దీక్షా శిబిరాలకు ముగింపు పలికిన అమరావతి రైతులు !
Amaravathi Farmers: మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో గత 1631 రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులు… ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధానిపై వారి ఆశలు మళ్ళీ చిగురించాయి. దీనికి తోడు ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు ప్రభుత్వం… రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేసి కొత్త వెలుగులు తీసుకొచ్చారు.
Amaravathi Farmers…
అంతేకాదు అమరావతి రాజధానికి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని స్పష్టత ఇచ్చారు. దీనితో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో దీక్షా శిబిరాలను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలో మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన మీడియాకు రాజధాని రైతులు ప్రత్యే కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని భారీ ఎల్ఈడీలో అమరావతి రైతులు దీక్షా శిబిరం వద్ద వీక్షించారు. అనంతరం తమ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : Nara Chandrababu Naidu: గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు ! .