Amazon Layoffs : లేదంటూనే అమెజాన్ జాబ్స్ కు చెక్
వేలాది మందికి కోలుకోలేని షాక్
Amazon Layoffs : ప్రపంచంలో టాప్ ఇకామర్స్ కంపెనీగా పేరొందింది జెఫ్ బేజోస్ సారథ్యంలోని అమెజాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. నిన్నటి దాకా లేదు లేదంటూనే కొలువులకు కోత పెట్టింది. ఆపై కోలుకోలేని రీతిలో చేదువార్త చెప్పింది. భారత దేశంలో కొన్ని కార్యకలాపాలకు సంబంధించిన భాగాలను మూసి వేస్తున్నట్లు(Amazon Layoffs) ప్రకటించింది.
ఆయా విభాగాలలో పని చేస్తున్న వందాలాది మందిని తొలగించింది. 10, 000 కంటే ఎక్కువ ఉన్న ఇ కామర్స్ వర్క్ ఫోర్స్ లో కొంత భాగం వరకు మాత్రమే ఎఫెక్ట్ పడుతుందని కంపెనీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు పది వేల కంటే పైగా ఎంప్లాయిస్ ను తీసి వేసేందుకు ప్లాన్ చేసింది.
ఆ మేరకు పావులు కదుపుతోంది. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కు 1.4 బిలియన్ వినియోగదారులను కలిగి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇతర ఇకామర్స్ కంపెనీలతో భారీ ఎత్తున పోటీ ఎదుర్కొంటోంది. ప్రధానంగా వాల్ మార్టక్ తో పాటు ఇండియాలో ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ , తదితర ఇకామర్స్ కంపెనీలుగా ఉన్నాయి.
భోజనం డెలివరీల నుండి నిష్క్రమిస్తున్నట్లు స్పష్టం చేసింది అమెజాన్(Amazon Layoffs) . అంతే కాకుండా చిన్న వ్యాపారాలకు ప్యాకేజ్ చేసిన వినియోగ వస్తువులను పెద్ద మొత్తంలో డోర్ స్టెప్ డెలివరీలను అందించే సేవలను కూడా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా అమెజాన్ భారత దేశంలో ఆన్ లైన్ రిటైల్ వంటి దాని ప్రధాన ఆఫర్లపై ఆధారపడి ఉంది. ఇదే సమయంలో అమెజాన్ వ్యాపారానికి సంబంధించిన అనేక రంగాల్లో వృద్ది మందగంచడంతో ప్రపంచ వ్యాప్తంగా అనవసర ఖర్చులు, ఉద్యోగాలలో కోత.
Also Read : ట్విట్టర్ బేజార్ ‘కూ’ దూకుడు
panugantijyothsna913@gmail.com