Ambati Ram Babu : గుంటూరు – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. ఇది పూర్తిగా రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు.
ఇలాంటి వాళ్లను ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. సభా సమావేశాలను జరగనీయకుండా కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సభా సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.
Ambati Ram Babu Comments on TDP MLA’s
తనపై నోరు పారేసుకుని, మీసం మెలేసిన నటుడు బాలకృష్ణ వ్యవహారంపై సీరియస్ గా స్పందించారు. ఇవాళ అంబటి రాంబాబు(Ambati Ram Babu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరన్నారు అంబటి రాంబాబు.
మీసం తిప్పితే ఊరు కునేందుకు నేనేమన్నా అమాయకుడిని, అనామకుడిని కానన్నారు. ఇక్కడ ఉన్నది అసలు సిసలైన కాపు బిడ్డ అని, నాది తెలుగు గడ్డ గుర్తుంచుకో బిడ్డా అంటూ హెచ్చరించారు ఏపీ మంత్రి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : TSRTC : టీఎస్ఆర్టీసీ ఖుష్ కబర్
