Ambati Rambabu : ప‌వ‌న్ ప్యాకేజీ స్టార్ – అంబ‌టి రాంబాబు

ఓ మ్యాడ్ డాగ్ అంటూ సంచ‌ల‌న కామెంట్స్

Ambati Rambabu : ఏపీలో మాట‌ల యుద్దం తారా స్థాయికి చేరింది. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ నీటి పారుద‌ల శాఖా మంత్రి అంబ‌టి రాంబాబు. ఆయ‌న శ‌నివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌తి చెడింద‌న్నారు. ఆయ‌న ప్యాకేజ్ స్టార్ గా మాత్ర‌మే జ‌నాల‌కు తెలుసంటూ ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబుకు ప‌ద‌వి , ప‌వ‌న్ కు ప్యాకేజీ ఇదే ఇద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య డీల్ అంటూ మండిప‌డ్డారు. వారాహి ఎక్కి బూతులు తిట్ట‌మ‌ని ఎవ‌రు చెప్పారంటూ ప్ర‌శ్నించారు. ఇదేనా నీ సంస్కాంర అని నిల‌దీశారు రాంబాబు.

నాలుగు ఏళ్ల‌కు ఒక‌సారి భార్య‌ను మార్చే సంస్కృతి లేద‌న్నారు. అది కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మాత్ర‌మే చెల్లుతుంద‌న్నారు. జ‌గ‌న్ గురించి తెలిస్తే పుస్త‌కం రాయొచ్చు క‌దా అని మండిప‌డ్డారు. అవాకులు , చెవాకులు పేలినంత మాత్రాన నాయ‌కుడైన‌ట్టా అని నిల‌దీశారు అంబ‌టి రాంబాబు(Ambati Rambabu). ఇంత కాలం నీ స్టాండ్ ఏమిటో నీకు తెలియ‌దు. ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నావో జ‌నాల‌కు అర్థం కాదు.

నువ్వంత‌కు నువ్వే లీడ‌ర్ న‌ని అనుకుంటే ఎలా అని అన్నారు. కాపుల‌ను బాబు ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఓ చీడ పురుగు లాంటి వాడ‌న్నారు. భీమ‌వ‌రంలో ఓ రౌడీ లాగా మాట్లాడాడంటూ ప‌వ‌న్ పై నిప్పులు చెరిగారు అంబ‌టి రాంబాబు. ఒక ర‌కంగా చెప్పాలంటే ప‌వ‌న్ ఓ పిచ్చి కుక్క అని ఫైర్ అయ్యారు.

Also Read : Ponguleti Srinivas Reddy : నా స‌త్తా ఏమిటో చూపిస్తా

Leave A Reply

Your Email Id will not be published!