Delhi CM Ambedkar : గాంధీ కంటే అంబేద్కర్ కు గౌరవం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Delhi CM Ambedkar : దళితుల విద్యకు వ్యతిరేకంగా మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారని అన్నారు ఆప్ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విద్యను అభ్యసించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు. చలించని సంకల్పం కారణంగా మహాత్మా గాంధీ కంటే బీఆర్ అంబేద్కర్ కు గొప్ప గౌరవం ఉందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో సీఎం(Delhi CM Ambedkar) కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అందడంతో దేశంలోని కొందరు దేశ వ్యతిరేకులు మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఆరోపించారు. అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని కలలు కన్నారని అన్నారు. అయితే ఆ వ్యక్తులు గత 75 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని , దేశంలో ప్రైవేట్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. బడులు పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశారు మనీష్ సిసోడియా. కానీ కొన్ని శక్తులు జీర్ణించు కోలేక పోయాయని ఆరోపించారు. ఢిల్లీ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాడని, ఐదేళ్లలో సమూల మార్పులు తీసుకు వచ్చాడని, అంబేద్కర్ కన్న కలల్ని సాకారం చేసిన ఘనత సిసోడియాదేనని కొనియాడారు. కానీ అనవసరంగా ఇరికించారని మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్(Delhi CM). గతంలో విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చిన వారిని నిరంకుశ దళారులు జైళ్లల్లో బంధించారని ఆరోపించారు.
Also Read : సమన్లు డోంట్ కేర్ – సంజయ్