#USA : కళ్లు తెరవండి..అమెరికా జపం మానండి
అదో అందమైన లోకం. అదో అద్భుతమైన ప్రపంచం. అదో భూతల స్వర్గం. లెక్కలేనంత స్వేచ్ఛ. అపరిమితమైన ఆనందం. కావాల్సినంత సంతోషం. తెలివి వుంటే చాలు..ఈజీగా బతికేయొచ్చు. అదే అమెరికా. వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలు తమ తమ ప్రాంతాలకే పరిమితమై పోతే..మన భారతీయులు మాత్రం చచ్చేంత దాకా అమెరికాను జపం చేస్తూనే ఉన్నారు.
అదో అందమైన లోకం. అదో అద్భుతమైన ప్రపంచం. అదో భూతల స్వర్గం. లెక్కలేనంత స్వేచ్ఛ. అపరిమితమైన ఆనందం. కావాల్సినంత సంతోషం. తెలివి వుంటే చాలు..ఈజీగా బతికేయొచ్చు. అదే అమెరికా. వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలు తమ తమ ప్రాంతాలకే పరిమితమై పోతే..మన భారతీయులు మాత్రం చచ్చేంత దాకా అమెరికాను జపం చేస్తూనే ఉన్నారు. ఎవ్వరు ఏమై పోతే ఏంటి..మనం బాగుంటే చాలు..కోరుకున్నది దక్కుతుందిగా..ప్రాణం పోసిన వాళ్ల సంగతి దేవుడెరుగు..మన ఆనందానికి అడ్డంటూ లేదుగా. చేతుల్లో డాలర్లున్నాయిగా ఇంకేందుకు ఇండియాకు వెళ్లడం అంటూ నిన్నటి దాకా బీరాలు పలికారు. అక్కడే ఉండి పోయారు. తమ ఉన్నతికి కారకులైన తల్లిదండ్రులను విస్మరించారు. తమ పురోభివృద్ధికి దోహద పడిన పాఠశాలలు, కాలేజీలు..వివిధ రంగాలను అన్నింటిని మరిచి పోయారు. పొద్దుటి నుంచి పడుకునే దాకా అమెరికా జపమే.
ఇక్కడి రిలేటివ్స్, పేరెంట్స్ సైతం మావాళ్లు అమెరికాలో ఉన్నారంటూ గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. టెక్నాలజీ మారింది. దాంతో పాటే మానవ సంబంధాలు మంటగలిసేలా ప్రవాస భారతీయులు ప్రవర్తించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా..ఎన్ని ఆస్తులు, అంతస్తులు కూడబెట్టినా..బ్యాంకుల్లో డాలర్లు మూలుగుతున్నా..ఈ దేశాన్ని ఏనాడో మరిచి పోయారు. ఇండియా అంటే చులకన. అమెరికా అంటే ఎక్కడలేనంతగా అభిమానం. చేతల్లో ..మాటల్లో..చూపుల్లో..నడతల్లో ప్రతి సందర్భంలోనూ యుఎస్ జపమే. తెలుగు వారైనా సరే ఇంగ్లీష్ లోనే మాట్లాడటం ఓ స్టేటస్ సింబల్ గా మార్చుకుంటూ వచ్చారు. అన్నెం పున్నెం ఎరుగని పిల్లల మనుషులను వీళ్లు చెడగొట్టారు. వాళ్లకు ఇంగ్లీష్ జాడ్యాన్ని అంటగట్టారు. మాతృ భాషకు మంగళం పాడారు. అమెరికాను ప్రేమించండంటూ నూరి పోశారు. వారి మెదళ్లను భ్రష్టు పట్టించారు. లక్షలాది మంది ఎన్.ఆర్.ఐలు తామేదో గొప్పవాళ్లమని..తాము అమెరికాలో ఉంటున్నామని..తమకు ఇక ఎదురే లేదంటూ విర్రవీగారు.
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను తూల నాడారు. అంతకంటే ఎక్కువగా ఈ దేశంలో ఉన్న వనరులు ఉపయోగించుకుని, ఇక్కడ ప్రభుత్వాలు అందజేసిన అవకాశాలను వాడుకుని ..రెక్కలు వచ్చాక అసలైన సమయంలో అమెరికాకు చెక్కేశారు. ఇలా అనడం కంటే ఈ దేశాన్ని మోసం చేశారని చెప్పడంలో తప్పు లేదు. పొద్దస్తమానం డాలర్ల జపం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు ఇపుడు కరోనా వైరస్ దెబ్బకు పునరాలోచనలో పడ్డారు. ఆస్తులు లేక పోయినా పర్వాలేదు కనీసం బతికితే చాలు అన్న స్థితికి దిగజారారు. ఈ ప్రబుద్దులకు ..జాతి విద్రోహులకు కష్టకాలంలో ఇండియా గుర్తుకు వస్తోంది. ఎలాగైనా సరే తమను ఇండియాకు పంపించండంటూ వేడుకుంటున్నారు. నిన్నటి దాకా ఐటీ జపం చేస్తూ వచ్చిన టెక్కీలు దిక్కుతోచని స్థితిలో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.
ఎక్కడుందీ అమెరికా..కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ఇపుడు ఎక్కడుందీ డాలర్. ఏ రూపాయి ఆదుకోవడం లేదు. ఏ దేశమూ నియంత్రించలేని స్థితికి చేరుకుంది. 33 కోట్ల మంది కలిగిన యుఎస్ ప్రెసిడెంటే చేతులెత్తేస్తే ఎలాంటి అవకాశాలు లేని 130 కోట్ల మంది సమున్నత భారతం ఒకే ఒక్క తాటిపై నిలబడింది. ఇదీ భారతీయత అంటే..ఇదీ సంస్కృతి అంటే. ఇదీ నాగరికత అంటే. ఈ దేశపు గాలి పీల్చి..ఈ మట్టిని ప్రేమించకుండా అమెరికా జపం చేస్తున్న ప్రవాస భారతీయుల్లారా మీరంతా అక్కడే ఉండండి. యుఎస్ లోనే డాలర్లతో సహవాసం చేయండి..మీ వల్ల ఈ దేశం ఎంతో నష్ట పోయింది. ఉపవాసం ఉన్నా పర్వాలేదు..కానీ మేరా భారత్ మహాన్. ఇకనైనా మీరు మారండి..కళ్లు తెరవండి. డాలర్ల కంటే ప్రాణమే ముఖ్యం. శవాల దిబ్బల మీద కాసులు ఏరుకునే కేపిటలిస్ట్ కంట్రీని ఇంకా ప్రేమిస్తూనే ఉంటారా..ఆలోచించండి..!
No comment allowed please