Amit Malviya : దీదీ పాలనలో రక్షణ కరువు – మాల్వియా
బీజేపీ అగ్ర నేత షాకింగ్ కామెంట్స్
Amit Malviya : బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ , పశ్చిమ బెంగాల్ జాతీయ కార్యవర్గ సభ్యుడు , మాజీ బ్యాంకర్ అమిత్ మాల్వియా(Amit Malviya) నిప్పులు చెరిగారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన వీడియోను పంచుకున్నారు. ఈ సందర్బంగా బెంగాల్ లో కొలువు తీరిన టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Amit Malviya Words
పేదలు, అణగారిన వర్గాలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాల్డ లోని బమంగోలా పోలీస్ స్టేషన్ లోని పకువా హాట్ ప్రాంతంలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్ర చేశారని, ఆపై చిత్రహింసలకు గురి చేశారని, కనికరం లేకుండా దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు అమిత్ మాల్వియా.
ఈ ఘటన జూలై 19న చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు సామాజికంగా అణగారిన వర్గానికి చెందిన వారు కావడం వల్లనే ఇలా దాడులకు గురయ్యారంటూ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఒక మహిళ సీఎంగా ఉండి కూడా స్పందించక పోవడం దారుణమన్నారు.
ఈ మొత్తం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసేలా చేసిందని, అయినా ఇప్పటి వరకు సీఎం దీదీ స్పందించ లేదని అమిత్ మాల్వియా ఆరోపించారు. వెంటనే ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Rinku Singh : ఆ 2 ఆటగాళ్లు నాకు స్ఫూర్తి- రింకూ సింగ్