Amit Malviya : ఓవైసీ..అఖిలేష్ పై బీజేపీ ఫైర్
నేరస్థులను ఆట కట్టిస్తే తప్పా
Amit Malviya : యూపీలో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ తీవ్ర దుమారం రేగింది. మాజీ ఎంపీ , గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్ తనయుడు అసద్ అహ్మద్ తో పాటు అతడి సహాయకుడు గులాం ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ . దీనిని ఫేక్ ఎన్ కౌంటర్ గా పేర్కొన్నారు. చట్టాలను చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు.
మరో వైపు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారని, తమ వారిని కాపాడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యానాథ్ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నా సరే మాఫియాను లేకుండా చేస్తానని ప్రకటించారు. ఇక ఓవైసీ, అఖిలేష్ యాదవ్ లపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది.
అసద్ అహ్మద్ , గులాం ఎన్ కౌంటర్లను సమర్థించింది గులాం తల్లి. తన కొడుకు శవాన్ని తీసుకు వెళ్లేందుకు ఆమె నిరాకరించారని ఈ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు బీజేపీ నేత అమిత్ మాల్వియా(Amit Malviya). ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్లకు లేని సమస్య వీళ్లకు మాత్రమే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ముస్లింలను నేరాలు, ఉగ్రవాదంతో ముడి పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ నేరస్థులకు ఓ గుణపాఠంగా మిగిలి పోతుందన్నారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని మీరు అనుకుంటే ఇక కోర్టులు ఎందుకు అని ప్రశ్నించారు ఓవైసీ.
Also Read : మహా కూటమి ఖాయం – నితీశ్