Amit Shah : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రైతు రుణమాఫీపై షా కీలక వ్యాఖ్యలు

ఇన్నాళ్లూరైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ....

Amit Shah : ఇప్పుడు దేశం చూపంతా మహారాష్ట్ర మీదే ఉంది. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమె బెంగాల్ అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరంపై అందరూ ఫోకస్ పెడుతున్నారు. స్థానిక పార్టీలతో కాంగ్రెస్, బీజేపీ జట్టు కట్టడంతో ఏ కూటమి నెగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ-మహాయుతి తీర్మానం లేఖను విడుదల చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సంకల్ప్ పత్ర పేరుతో రిలీజ్ చేసిన ఈ లెటర్‌లో తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి క్లారిటీ ఇచ్చారు.

Amit Shah Comments..

ఇన్నాళ్లూరైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ.. తొలిసారి దీనిపై సానుకూలంగా స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ-మహాయుతి కూటమి రైతు రుణమాఫీని ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు లడ్కీ బహిన్ యోజన కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతున్నట్లు తెలిపింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌లను కూడా రూ.1500 నుంచి రూ.2,100కి పెంచుతున్నట్లు కూటమి నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. తమ సర్కారులో 25 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు. పవర్‌లోకి వచ్చిన 100 రోజుల్లో టెక్నాలజీ బలోపేతం కోసం విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని వ్యాఖ్యానించారు.

Also Read : TG News : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పేలుడు ఘటన వెనక తీవ్ర అనుమానాలు

Leave A Reply

Your Email Id will not be published!