Amit Shah : విశాఖలో 8న అమిత్ షా సభ
తిరుపతిలో 10న జేపీ నడ్డా సభ
Amit Shah : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాయి. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఫుల్ బిజీగా మారింది. ఇదే సమయంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ బాబు సభలు, పాదయాత్రలతో హోరెత్తిస్తున్నారు.
ఇక ఈసారి ఎలాగైనా పవర్ లోకి రాక పోయినా కనీసం ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే ఆ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. నార్త్ లో దుమ్ము రేపిన ఆ పార్టీకి దక్షిణాదిన ఇంకా మింగుడు పడడం లేదు. నిన్నటి దాకా కర్ణాటకలో కొలువు తీరిన కాషాయ పార్టీకి ఝలక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 224 సీట్లకు గాను 65 సీట్లకే పరిమితమైంది.
ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా ధీటుగా పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో ఏపీలో ఊహించని విధంగా ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) విశాఖ పట్టణానికి రాబోతున్నారు. జూన్ 8న బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఈ సభలో కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎటు వైపు మొగ్గు చూపుతారనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ పవన్ తమతోనే ఉన్నాడని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ సోము వీర్రాజు. ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్. ఏది ఏమైనా ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకే షా వస్తున్నట్లు టాక్.
Also Read : PM Modi