Kharge Amit Shah : అమిత్ షా..మంత్రివా లేక పూజారివా

అమిత్ షాపై నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్

Kharge Amit Shah : మ‌రోసారి రామ మందిరం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేంద్ర హోం శాఖ మంత్రి త్రిపురలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రామాల‌య నిర్మాణం వేగ‌వంతంగా జ‌రుగుతోంద‌ని, జ‌న‌వ‌రి 1, 2024న ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

దీనిపై తీవ్రంగా స్పందించారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. అస‌లు నువ్వు కేంద్ర మంత్రివా లేక ఆల‌యానికి పూజారివా అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా త్వ‌ర‌లో 9 రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర‌, మేఘాల‌య రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే శుక్ర‌వారం బీజేపీని ,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను(Kharge Amit Shah) టార్గెట్ చేశారు. నువ్వు రాజ‌కీయ నాయ‌కుడివి, పూజారివి కాద‌న్నారు. దేశాన్ని ర‌క్షించ‌డం నీ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో ఫోక‌స్ పెట్టాలి కానీ ఇత‌ర అంశాల‌పై కాద‌న్నారు ఖ‌ర్గే.

నువ్వు దేవాదాయ శాఖ మంత్రివి కాద‌ని ఎద్దేవా చేశారు ఖ‌ర్గే. ఇవాళ ఏఐసీసీ చీఫ్ హ‌ర్యానా లోని పానిప‌ట్ లో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఖ‌ర్గే అమిత్ షాపై నిప్పులు చెరిగారు. మతం పేరుతో రాజ‌కీయం చేయ‌డం తప్పా దేశానికి చేసింది ఏమీ లేద‌న్నారు.

Also Read : ఉగ్ర‌వాదం అంతం అభివృద్దికి అంద‌లం

Leave A Reply

Your Email Id will not be published!