Amit Shah : ఆట మొదలెట్టిన అమిత్ షా
మనవరాళ్లతో కేంద్ర మంత్రి
Amit Shah : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీలో మోస్ట్ పవర్ ఫుల్ కేంద్రమంత్రిగా గుర్తింపు పొందారు. అన్నీ తానై వ్యవహరించారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ మధ్య ప్రదేశ్ లో తిరిగి గెలుపొందగా అదనంగా ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇదే సమయంలో మిజోరంలో ప్రతిపక్ష పార్టీ పవర్ లోకి వచ్చింది.
Amit Shah Ruling
ఇక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు రాక్షస పాలన సాగించిన భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ కేసీఆర్ సర్కార్ ను ప్రజలు గద్దె దించారు. అయితే అనూహ్యంగా బీజేపీ 8 సీట్లు తెచ్చుకుంది. ఇదే సమయంలో ఆ పార్టీ ఓటు శాతాన్ని పెంచుకుంది.
ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీయకుండా చేయాలని ప్రయత్నం చేసిన ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు జనం బండకేసి కొట్టారు.
కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు కట్టబెట్టారు. ఇదే సమయంలో కర్ణాటకలో సైతం బీజేపీ తన అధికారాన్ని కోల్పోయింది. అక్కడ కూడా హస్తానికి అందలం ఎక్కించారు. దీంతో ఉత్తర భారత దేశంలో బీజేపీ హవా కొనసాగుతుంటే దక్షిణ భారత దేశంలో ప్రతిపక్షాలు జెండా ఎగుర వేయడం విశేషం.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించిన దానికంటే అత్యధికంగా ఫలితాలు రావడంతో అమిత్ షా సంతోషానికి లోనవుతున్నారు. తన మనవరాళ్లతో ఏకంగా చెస్ ఆడటం మొదలు పెట్టారు.
Also Read : Telangana Ministers : మంత్రులకు అదనపు బాధ్యతలు