Amit Shah : పంజాబ్ సర్కార్ కు అమిత్ షా కితాబు
అమృతపాల్ సింగ్ అణిచివేతపై కామెంట్స్
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కలిస్తాన్ ఉద్యమానికి మద్దతు పలుకుతూ గత మార్చి 18న పరారైన అమృత పాల్ సింగ్ ను కట్టడి చేయడంలో భగవంత్ మాన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించడంపై ప్రశంసల వర్షం కురిపించారు. అతడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా కలిసి దర్యాప్తు ప్రారంభించాయి.
పరారీలో ఉన్న ఖలిస్తానీ అనుకూల నాయకుడు అమృత పాల్ సింగ్ , అతడి సంస్థ వారిస్ పంజాబ్ దే పై చర్య తీసుకుంది పంజాబ్ సర్కార్. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సైతం భగవంత్ మాన్ ను కితాబు ఇచ్చారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా పంజాబ్ ప్రభుత్వం మంచి పనేస్తోందంటూ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ ప్రభుత్వం మంచి పని చేసింది. కేంద్రం కూడా సహకరిస్తోందని చెప్పారు అమిత్ షా(Amit Shah) శనివారం ఇండియా టుడే కర్ణాటక రౌండ్ టేబుల్ లో స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా వారిస్ దే పంజాబ్ చీఫ్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగినప్పుడు అమిత్ షా బదులిచ్చారు. తాము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. భారత దేశ ఐక్యత , సార్వ భౌమాధికారంపై ఎవరూ దాడి చేయలేరన్నారు. ఇది కొంత కాలం జరగవచ్చని పేర్కొన్నారు.
Also Read : కర్ణాటక ఎన్నికల బరిలో 3,044