Amit Shah : బసవేశ్వరుడి బోధనలు, అనుసరించిన జీవన విధానం స్పూర్తి దాయకమని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). కర్ణాటకలో కేంద్ర మంత్రి పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా 12 వ శతాబ్దపు సంఘ సంస్కర్త లింగాయత్ కమ్యూనిటీకి చెందిన సన్యాసి (గురువు) బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమిత్ షా. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో అత్యధికంగా ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు లింగాయత్ లు. ఆ కమ్యూనిటీని మచ్చిక చేసుకోవడంలో భాగంగా అమిత్ షా(Amit Shah) ఇందులో పాల్గొన్నారు.
ప్రముఖ లింగాయత్ పీఠాధిపతి శ్రీ శివకుమార్ స్వామీజీ జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి చివరి సారిగా బెంగళూరు నగరానికి వచ్చారు. రాజకీయంగా ప్రభావంతమైన కమ్యూనిటీగా లింగాయత్ లు ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 140కి పైగా స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ వీరే కీలకం. రాజకీయ పరిశీలకుల అంచనాల ప్రకారం 90 సీట్లను వీరు పూర్తిగా శాసించగలరు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.
బసవన్నగా ప్రసిద్ది చెందారు బసవేశ్వరుడు. ఆయన జయంతిని బసవ జయంతిగా జరుపుకుంటారు. కర్ణాటకలో సెలవు దినం కూడా.
ఇదే సమయంలో జనతాదళ్ కు చెందిన సీనియర్ నాయకులు , కర్ణాటక లెజిస్టేలివ్ కౌన్సిల్ చైర్మన్ బసవరాజ హోరట్టి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.
Also Read : జిగ్నేష్ కేసులో ఖాకీల తీరుపై కోర్టు కన్నెర్ర