Amit Shah : ఈశాన్య ప్రాంతాల‌పై అమిత్ షా కామెంట్స్

ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాయి

Amit Shah : సాయుధ బ‌ల‌గాల చ‌ట్టం ప్ర‌కారం ఈశాన్య ప్రాంతంలో స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అన్నారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా (Amit Shah) .

1942లో క్విట్ ఇండియా ఉద్య‌మాన్ని అణిచి వేసేందుకు బ్రిటిష్ పాల‌న ద్వారా రూపొందించిన ఎఎఫ్ఎస్పీఏ (AFSPA) 1958లో ప్ర‌క‌టించారు. ఈ చ‌ట్టం సాయుధ బ‌ల‌గాల‌ను అంత‌రాయం క‌లిగించే ప్రాంతాలుగా నియ‌మించిన ప్రాంతాల‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను నియంత్రించేందుకు అనుమ‌తి ఇస్తుంది.

ద‌శాబ్దాల త‌ర్వాత నాగాలాండ్, అస్సాం, మ‌ణిపూర్ ల‌లో సాయుధ

ద‌ళాల ప్ర‌త్యేక అధికారాల చ‌ట్టం ప‌రిధిలోని ప్రాంతాల‌ను కేంద్ర స‌ర్కార్ ఇవాళ త‌గ్గించింద‌ని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah)తెలిపారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

న‌రేంద్ర మోదీ (Narendra Modi) సార‌థ్యంలోని ప్ర‌భుత్వం కేంద్రంలో కొలువు తీరాక దేశంలో స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని పేర్కొన్నారు షా. ప్ర‌త్యేకించి బ‌ల‌గాల అవ‌స‌రం రాను రాను త‌గ్గ‌నుంద‌న్నారు.

శాశ్వ‌త‌మైన శాంతి, సుస్థిర‌మైన అభివృద్ధిని వేగ‌వంతం చేసేందుకు ఇది దోహ‌దం చేస్తుంద‌ని పేర్కొన్నారు అమిత్ షా(Amit Shah). ఏఎఫ్ఎస్పీఏ (AFSPA) సెక్ష‌న్ 4 సాయుధ ద‌ళాల‌కు ప్ర‌త్యేక అధికారాల‌ను క‌ల్పిస్తుంది.

కాల్పులు జ‌రిపేందుకు, వారెంట్లు లేకుండా వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసేందుకు, చెక్ చేసేందుకు, విచారించేందుకు ఈ బ‌ల‌గాల‌కు అధికారం ఉంది.

ఈశాన్య రాష్ట్రాల‌లో వివాదాస్ప‌దంగా మారింది ద‌ళాలు జ‌రిపిన దాడులు. నాగాలాండ్ (Nagaland) లో మోన్ జిల్లాలో జ‌రిగిన ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో 14 మంది పౌరులు మ‌ర‌ణించారు.

ఇదిలా ఉండ‌గా అసోం (Assam) స‌ర్కార్ మార్చి1న సాయుధ బ‌ల‌గాల చ‌ట్టాన్ని మ‌రో ఆరు నెల‌ల పాటు పొడిగించింది.

Also Read : దేశం కోసం చ‌ని పోయేందుకు సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!