Amit Shah : హనుమాన్ జయంతి సందర్భంగా రెండు రోజుల క్రితం వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశించారు.
ఇదిలా జహంగీర్ పురి హింసలో మైనర్ లతో సహా 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానాను ఆదేశించారు అమిత్ షా.
నిందితుల్లో ఒకరు బాలనేరస్థుడంటూ హైకోర్టులో ఈరోజు దాఖలైన పిటిషన్ పై పోలీసులు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. అతడిని అరెస్ట్ చేసినప్పుడు 21 లేదా 22 సంవత్సరాల వయసు గలిగిన జువైన్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచినట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
శనివారం సాయంత్రం గందరగోళం చెలరేగిన హనుమాన్ జయంతి ఊరేగింపు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు మూడు ఊరేగింపులు నిర్వహించారు.
తాము ఎవరికీ ర్యాలీను నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం విశేషం. కాషాయ జెండాలు పట్టుకుని మసీదు దాటి వెళుతుండగా ముస్లింలు మసీదు నుంచి బయటకు వచ్చి ఘర్షణకు దిగారు.
దీంతో ఊరేగింపు సభ్యులు, మసీదులో ప్రార్థనలు చేస్తున్న ఇరు వర్గాల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. రంజాన్ జరుగుతోంది. సాయంత్రం ముస్లింలు ప్రార్థనలు చేస్తారు.
సమూహాన్ని వాల్యూమ్ తగ్గించమని అడిగారు. కానీ వారు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది ప్రారంభ సమస్యకు దారితీసిందని మరో అధికారి తెలిపారు. ఈ కేసులో మైనర్ లతో సహా 23 మందిని అరెస్ట్ చేశారు.
Also Read : మరాఠా అచల్ పూర్ లో ఘర్షణ..కర్ఫ్యూ