Amit Shah : మక్తల్ – దేశంలోనే అతి పెద్ద అవినీతిమయం అయిన ఏకైక సర్కార్ ఏదైనా ఉందంటే అది తెలంగాన ప్రభుత్వమేనని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించ బోతున్నాయని ఈ ఎన్నికలు అంటూ పేర్కొన్నారు. ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
Amit Shah Comments on KCR Ruling
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మక్తల్ , పటాన్ చెరు లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇవాళ దేశంలో సుస్థిరమైన పాలనను అందించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు అమిత్ షా(Amit Shah). ఇంకే పార్టీకి ఆ సామర్థ్యం లేనే లేదన్నారు.
మోదీ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఈ దేశమే కాదు యావత్ ప్రపంచం గుర్తించిందని అన్నారు. తాము గనుక అధికారంలోకి వస్తే చేనేత, మత్స్యకారులు, రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామన్నారు. నమ్మి బీఆర్ఎస్ కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని దివాళా తీయించేలా చేశాడని ఆరోపించారు.
సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకోవడం ప్రారంభించాడని ఇంతకంటే ఇంకేమీ చేయలేడని అన్నారు. కేవలం ఈ పదేళ్ల కాలం దోచుకునేందుకు, దాచుకునేందుకు మాత్రమే పని చేశాడంటూ మండిపడ్డారు.
Also Read : Yogi Adityanath : గడీల పాలనలో అన్నీ గాయాలే