Amit Shah : కాంగ్రెస్ అంత‌రాయం అమిత్ షా ఆగ్ర‌హం

కావాల‌ని స‌మావేశాలు అడ్డుకున్నారు

Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సీరియ‌స్ అయ్యారు. ప‌దే ప‌దే పార్ల‌మెంట్ లో స‌మావేశాలు స‌జావుగా సాగ‌నీయ‌కుండా కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. భార‌త దేశంలోని అరుణాచ‌ల్ వ‌ద్ద చైనా భార‌త్ ద‌ళాలు ఘ‌ర్ష‌ణ ప‌డ్డాయ‌ని, ఈ ఘ‌ట‌న‌లో ఇరు వ‌ర్గాలకు గాయాలైన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీనిపై భార‌త ఆర్మీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతానికి స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింద‌ని ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిపక్షాలు ఇదే అంశానికి సంబంధించి చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌ట్టాయి. మ‌రికొంద‌రు స‌భ్యులు వాయిదా తీర్మానం ప్ర‌వేశ పెట్టారు.

మ‌రో వైపు భార‌త్, చైనా మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌పై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మీడియాతో మాట్లాడారు. జాబితాను ఇప్ప‌టికే ఇచ్చామ‌ని, ఆందోళ‌న‌ను అర్థం చేసుకున్నార‌ని అన్నారు.

అయితే కావాల‌ని అడ్డు ప‌డ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు అమిత్ షా. ప్ర‌తిప‌క్షాలు ఎంత‌కూ విన‌క పోవ‌డంతో స్పీక‌ర్ వాయిదా వేశారు. ఈ సంద‌ర్బంగా అమిత్ షా జోక్యం చేసుకున్నారు. అస‌లు స‌మ‌స్య‌ను ప‌క్క‌న పెట్టి ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.

ఈ అంశంపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి ప్ర‌క‌ట‌న చేస్తార‌ని చెప్పిన త‌ర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యానికి అంత‌రాయం కలిగించింద‌న్నారు అమిత్ షా. మోడీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నంత వ‌ర‌కు సెంటు భూమిని ఎవ‌రూ స్వాధీనం చేసుకోలేర‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : స‌రిహ‌ద్దు వివాదం ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!