Amit Shah : అద్దాలు తీయండి అభివృద్ధి చూడండి
గాంధీ ఫ్యామిలీపై అమిత్ షా సెటైర్
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గాంధీ ఫ్యామిలీపై విరుచుకు పడ్డారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు అమిత్ షా హాజరయ్యారు. మీరు పెట్టుకున్న అద్దాలు విదేశాలవి. ఆ కళ్లకు పొరలు కమ్మాయి. ఆ ఇటాలియన్ గ్లాసులు తీసేస్తే భారతం దేశంలో ఏం జరుగుతుందో కనిపిస్తుందన్నారు.
కళ్లకు ఉన్న అద్దాలు తీసేస్తే ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కార్ ఎలాంటి అభివృద్ధి చేసిందో కనిపిస్తుందన్నారు. కళ్లుండీ కబోధి లాగా గాంధీ ఫ్యామిలీ వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు అమిత్ షా(Amit Shah).
గత ఎనిమిది ఏళ్లల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి ఆదివారం తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
వాయనాడు ఎంపీకి ఈ దేశం పట్ల అవగాహన లేదన్నారు. ముందస్తు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశామన్నారు.
ఇవాళ రూ. 1,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అమిత్ షా ప్రాంరంభోత్సవం, శంకుస్థాపన చేశారు. రాహుల్ గాంధీని రాహుల్ బాబా అంటూ అభివర్ణించారు.
కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధిని కేవలం 8 ఏళ్లలో చేసి చూపించామన్నారు అమిత్ షా(Amit Shah).
Also Read : పకేంద్రం నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం