Amit Shah : నిరాశ ప‌ర్చిన అమిత్ షా

ప్ర‌భావం చూప‌ని ప్ర‌సంగం

Amit Shah : తెలంగాణ – భార‌తీయ జ‌న‌తా పార్టీలో జోష్ నింపాల్సిన ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ చంద్ర షా(Amit Shah) టూర్ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. నిన్న‌టి దాకా ప‌వర్ లోకి వస్తామ‌ని ప్ర‌క‌టించినా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జోష్ పార్టీలో క‌నిపించ‌డం లేదన్న వ్య‌క్తం అవుతోంది పార్టీ శ్రేణుల్లో.

Amit Shah Telangana Status

ఎప్పుడైతే బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ ను తొల‌గించింది బీజేపీ హైక‌మాండ్. ఆయ‌న స్థానంలో ఎలాంటి పోరాట ప‌టిమ క‌నిపించ‌ని, సౌమ్యుడిగా పేరొందిన గంగాపురం కిష‌న్ రెడ్డికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించింది.

ఆయ‌న వ‌చ్చాక రాష్ట్రంలో అధికారంలో కొలువు తీరిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను, ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవ‌డంలో, దాడి చేయ‌డంలో, స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లను ప‌క్క‌న పెట్ట‌డంతో బీజేపీ ఏ మేర‌కు రాణిస్తుందో వేచి చూడాలి. ఒక్క ఈట‌ల రాజేంద‌ర్ , ర‌ఘునంద‌న్ రావులు మాత్ర‌మే వాయిస్ ను పెంచుతున్నారు. ఇక ధ‌ర్మ‌పురి అర్వింద్ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

ఓ వైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోల‌ను ప్ర‌క‌టించాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఏం చేస్తుందో చెప్ప‌లేదు. బీసీ అభ్య‌ర్థిని సీఎం చేస్తామంటూ ప్ర‌క‌టించ‌డం మాత్రమే కొస మెరుపు. ఇక‌నైనా మేనిఫెస్టోపై ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

Also Read : Congress Pending : పెండింగ్ లో 19 స్థానాలు

Leave A Reply

Your Email Id will not be published!