Amit Shah Tour : విశాఖ‌లో అమిత్ షా స‌భ

ఏపీలో బీజేపీ ఫోక‌స్ పై ఉత్కంఠ

Amit Shah Tour : ఏపీలోని విశాఖ ప‌ట్ట‌ణానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆదివారం రానున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ఏర్పాటై 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సేవా, సుప‌రిపాల‌న‌, ప్ర‌జ‌ల సంక్షేమం ల‌క్ష్యంగా విజ‌య‌వంత‌మైన ఫ‌లాల‌ను అంద‌జేసిందని బీజేపీ పేర్కొంది. ఈ మేర‌కు దేశ వ్యాప్తంగా గ‌త మే 30 నుండి జూన్ 30 వ తేదీ వ‌ర‌కు విజ‌యోత్స‌వ సంబురాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది.

బీజేపీ ఏపీ శాఖ ఆధ్వ‌ర్యంలో నిన్న తిరుప‌తిలో స‌భ‌ను ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఇక ఇవాళ విశాఖ‌లో జ‌రిగే స‌భకు ముఖ్య అతిథిగా రానున్నారు అమిత్ చంద్ర షా(Amit Shah).

ప‌ట్ట‌ణంలోని రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు బ‌హిరంగ స‌భ‌ను . అనంత‌రం సాగ‌ర‌మాల క‌న్వెన్ష‌న్ హాల్ నందు జ‌రిగే పోలింగ్ బూత్ శ‌క్తి కేంద్ర ప్ర‌ముఖుల స‌మావేశంలో అమిత్ షా ప్ర‌సంగించారు. అనంత‌రం ఢిల్లీకి తిరిగి వెళ‌తారు. ఇదిలా ఉండ‌గా తిరుప‌తిలో పాల్గొన్న జేపీ న‌డ్డా అక్క‌డి నుంచి నేరుగా శ్రీ‌కాళ‌హ‌స్తిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.

ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు, మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు, సీఎం ర‌మేష్ , ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి దేవి .

Jaya kishori Morari Bapu : బాపు సాంగ‌త్యం అద్భుతం – జ‌యా

Leave A Reply

Your Email Id will not be published!