Amit Shah Elections : అమిత్ షా ఎన్నికల ప్రచారం రద్దు
మణిపూర్ లో చెలరేగిన విధ్వంసం
Amit Shah Elections : మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా రద్దు చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. పరిస్థితిని అమిత్ షా నిశితంగా పరిశీలించారు.
మణిపూర్ లో ప్రకటించిన రిజర్వేషన్ తీవ్ర వివాదాలకు దారి తీసేలా చేసింది. దీంతో కర్ణాటకలో శుక్రవారం పర్యటించాల్సి ఉంది అమిత్ షా. తన కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణ పరిస్థితులు సద్దు మణిగేంత వరకు వెళ్లకూడదని , మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ , ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah Elections) అర్ధరాత్రి చర్చలు జరిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా మణిపూర్ తో పాటు అస్సాం, నాగాలాండ్, మిజోరాం సీఎంలతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతేకాదు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కేంద్ర పారా మిలటరీ బలగాలను మణిపూర్ కు పంపించాలని ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర బలగాలు కూడా అప్రమత్తం అయ్యాయి.
Also Read : సీమాంతర ఉగ్రవాదం ప్రమాదం – జైశంకర్