Bandi Sanjay KCR : సీఎం కేసీఆర్ కు బండి బహిరంగ లేఖ
గ్యాంగ్ రేప్ కేసు సీబీఐకి అప్పగించాలి
Bandi Sanjay KCR : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది హైదరాబాద్ లోని అమ్నీషియా పబ్ అత్యాచార ఘటన. ముగ్గురు మైనర్లు ఇద్దరు మేజర్లు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితురాలి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.
ఇందులో పెద్దల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలను వెస్ట్ జోన్ డీసీపీ కొట్టి పారేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
లేదంటే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ నాయకులు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా ఫోటోలు, వీడియో క్లిప్ కూడా బహిరంగం చేశారు.
తమపై ఆరోపణలు చేసిన డీసీపీకి తెలియ చేసేందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay KCR) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. ఇందులో ఎవరు ఉన్నా, ఎంతటి స్థాయి వారైనా సరే వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర పోలీసులు కాకుండా సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో మరొకరు అరెస్ట్