Sandeep Patil Amol Kale : సందీప్ పాటిల్ పై అమోల్ కాలే విక్టరీ
ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు
Sandeep Patil Amol Kale : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో ఒక్క రోజర్ బిన్నీ తప్ప మిగతా వారంతా క్రికెట్ ఆడని వాళ్లే కావడం విశేషం. ఇదే సీన్ మిగతా రాష్ట్రాలలో కంటిన్యూ అవుతోంది.
తాజాగా దేశ క్రికెట్ రంగాన్ని శాసిస్తూ వచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది మాజీ భారత క్రికెట్ జట్టు ఆటగాడు సందీప్ పాటిల్ కు(Sandeep Patil).
గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా పని చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కూడా పని చేశాడు. సందీప్ పాటిల్ 29 టెస్టులు 45 వన్డే మ్యాచ్ లు ఆడాడు.
విచిత్రం ఏమిటంటే ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో సందీప్ పాటిల్, అమోల్ కాలే(Sandeep Patil Amol Kale), చేతిలో ఓటమి పాలయ్యారు.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే , బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ మద్దతు ఉన్న కాలే పాటిల్ పై 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
సందీప్ పాటిల్ కు 158 ఓట్లు రాగా అమోల్ కాలేకు 183 ఓట్లు వచ్చాయి.
గతంలో అమోల్ కాలే ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సందీప్ పాటిల్ భారత క్రికెట్ రంగంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఎలాంటి వివాదాలు
లేని క్రికెటర్. కేవలం ఆటపై మాత్రమే ఫోకస్ పెడుతూ వచ్చాడు సందీప్ పాటిల్. భారత్, కెన్యా, ఒమన్ జట్లతో కోచ్ గా పని చేసిన
అనుభవం కూడా ఉంది.
ఇదిలా ఉండగా బీసీసీఐ ఇప్పుడు బీజేపీ ఆఫీసుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో ఒకరు ఒకే పదవి కలిగి ఉండాలన్న నిబంధనకు తిలోదకాలు ఇచ్చారు.
అమిత్ షా కొడుకు జే షా సెక్రటరీగా ఉన్నారు. ఇక కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తనయుడు తరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్ గా ఉన్నారు.
Also Read : జే షా కామెంట్స్ అక్రమ్ సీరియస్