Anand Mahindra : అరుదైన వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా

ఆనందానికి చిరునామా మ‌హీంద్రా

Anand Mahindra : భార‌త దేశంలో గ‌ర్వించ ద‌గిన వ్యాపార‌వేత్త‌ల‌లో ఒక‌రుగా పేరు పొందారు ఆనంద్ మ‌హీంద్రా. ప్ర‌స్తుతం మ‌హీంద్రా గ్రూప్ కు చైర్మ‌న్ గా ఉన్నారు. వృత్తి ప‌రంగా ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అత్యంత స్పూర్తి దాయ‌క‌మైన వ్య‌క్తుల్ని ప‌రిచ‌యం చేస్తారు. ఎక్క‌డ ఏ చిన్న అంశం త‌న‌కు న‌చ్చితే వెంట‌నే ష‌ర్ చేస్తారు. అంతేనా వారంలో ఒక రోజు స్పూర్తి క‌లిగించే క‌థ‌ను కూడా , విజ‌య గాథ గురించి ప‌రిచ‌యం చేస్తారు ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra).

ఆనంద్ గోపాల్ మ‌హీంద్రా పారిశ్రామిక‌వేత్త కుటుంబంలోని మూడో త‌రంలో హ‌రీష్ , ఇందిరా దంప‌తుల‌కు పుట్టాడు ఆనంద్ మ‌హీంద్రా. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కో ఫౌండ‌ర్ జ‌గ‌దీశ్ చంద్ర మ‌హీంద్రా మ‌న‌వ‌డు. వాహ‌నాల త‌యారీ రంగంలో ప్ర‌స్తుతం టాప్ లో కొన‌సాగుతోంది మ‌హీంద్రా కంపెనీ. దీని వెనుక ఆనంద్ మ‌హీంద్రా ఉన్నారు. ఎక్క‌డా త‌గ్గ‌ని మ‌న‌స్త‌త్వ‌మే ఆయ‌న‌ను ఇంత‌టి వాడిని చేసింది.

మ‌హీంద్రా కంపెనీకి అన్నీ ఆయ‌నే. జీప్ ల ఉత్ప‌త్తి నుండి ఏరో స్పేస్ , ఫైనాన్స్ , ఇన్సూరెన్స్ , అగ్రి బిజినెస్ , కాంపోనెంట్స్ , డిఫెన్స్ , ఎన‌ర్జీ , నిర్మాణ ప‌రిక‌రాలు, ఎక్విప్ మెంట్ , లీజ‌ర్ , హాస్పిటాలిటీ, ఇండ‌స్ట్రియ‌ల్ ఎక్విప్ మెంట్ , ఐటీ, లాజిస్టిక్స్ , రియ‌ల్ ఎస్టేట్ , రిటైల్ లలోకి విస్త‌రించేలా చేశారు ఆనంద్ మహీంద్రా.

హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఆర్కిటెక్చ‌ర్ , ఎంబీఏ ప‌ట్టా పొందారు . మ‌హీంద్రాలో ప‌ని చేసేందుకు తిరిగి రావాల‌ని అనుకున్నాడు. ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం బిల్ గేట్స్ , ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra) హార్వ‌ర్డ్ లో క్లాస్ మేంట్స్ . 1981లో ఉజిన్ స్టీల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా చేరాడు. 1989లో కంపెనీకి ప్రెసిడెంట్ , డిప్యూటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా నియ‌మితుల‌య్యారు. విజ‌యాలే కాదు ప‌రాజ‌యాలు కూడా ఎదుర్కొన్నాడు ఆనంద్ మ‌హీంద్రా. మహీంద్రా తీసుకు వ‌చ్చిన స్కార్పియో దుమ్ము రేపింది.

ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎస్ యూ వీ వాహ‌నాల్లో టాప్ లో కొన‌సాగుతోంది. ఇదంతా ఆనంద్ మ‌హీంద్రా చేసిన కృషి అని చెప్ప‌క త‌ప్ప‌దు. వాహ‌న రంగంలో 36 శాతం వాటాను క‌లిగి ఉంది. మొత్తంగా ఆనంద్ మ‌హీంద్రా వ‌య‌స్సు ఇప్పుడు 68 ఏళ్లు. ఆయ‌న ఆస్తుల విలువ ఫోర్బ్స్ అంచ‌నా ప్ర‌కారం రూ. 17 వేల కోట్లు. లెక్క‌లేన‌న్ని ఆస్తులు ఉన్నాయి. కానీ ఎక్క‌డా ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌డు ఆనంద్ మ‌హీంద్రా. ఆయ‌న‌కు దేశ‌మంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆ దిశ‌గానే ఆయ‌న ప్ర‌యాణం చేస్తున్నారు.

Also Read : మ‌రాఠా దినోత్స‌వం మోదీ సందేశం

Leave A Reply

Your Email Id will not be published!