AP Budget 2023 : ఏపీ బడ్జెట్ రూ. 2,79,279 కోట్లు
అసెంబ్లీ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
AP Budget 2023 : ఏపీ సర్కార్ అసెంబ్లీలో 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం వరాలు కురిపించింది. పేదల సంక్షేమమే తమ లక్ష్యంగా ప్రకటించారు సీఎం జగన్ రెడ్డి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ రూ. 2 లక్షల 79 వేల 279 కోట్లు(AP Budget 2023).
ఇందులో రెవిన్యూ ఖర్చు రూ. 2, 28, 540 కోట్లు కాగా మూల ధన ఖర్చు రూ. 31,061 కోట్లు. సంక్షేమానికే ప్రయారిటీ ఇచ్చింది ప్రభుత్వం. రైతు భరోసా కు రూ. 4,020 కోట్లు , పెన్షన్ కానుకకు రూ. 21, 434.72 కోట్లు. విద్యా దీవెన పథకానికి రూ. 2,841.64 కోట్లు , వసతి దీవెనకు రూ. 2,200 కోట్లు కేటాయించింది జగన్ సర్కార్.
వైఎస్సార్ పీఎం బీమా యోజన పథకానికి రూ. 1,600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 1,000 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు రూ. 500 కోట్లు కేటాయించింది. జగనన్న చేదోడు పథకానికి రూ. 350 కట్లు, కాపు నేస్తంకు రూ. 550 కోట్లు, వాహన మిత్ర పథకానికి రూ. 275 కోట్లు , నేతన్న నేస్తం కు రూ. 200 కోట్లు కేటాయింపు జరిపింది.
మత్స్యకార భరోసా పథకానికి రూ. 125 కోట్లు , మత్స్యకారుల కు సంబంధించిన డీజిల్ సబ్సిడీకి రూ. 50 కోట్లు , రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు కేటాయించింది జగన్ సర్కార్. లా నేస్తం పథకానికి రూ. 17 కోట్లు, జగనన్న తోడుకు రూ. 35 కోట్లు, ఈబీసీ నేస్తం కు రూ. 610 కోట్లు , కల్యాణ మస్తు పథకానికి రూ. 200 కోట్లు, ఆసరా పథకానికి రూ. 6,700 కోట్లు , చేయూత పథకానికి రూ. 5,000 కోట్లు కేటాయించింది(AP Budget 2023).
అమ్మ ఒడికి రూ. 6,500 కోట్లు , ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ. 1,212 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.15,882 కోట్లు , నాడు నేడు పథకానికి రూ. 3,500 కోట్లు , విద్యా కానుకకు రూ. 560 కోట్లు , పంచాయారీజ్ గ్రామీణ అభివృద్దికి రూ. 1,873 కోట్లు, పురపాలక, పట్టణ అభివృద్దికి రూ. 9,381 కోట్లు , స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 1,166 కోట్లు కేటాయించింది జగన్ సర్కార్.
యువజన , పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 1,291 కోట్లు , ఎస్సీల కోసం రూ. 20,005 కోట్లు, ఎస్టీలకు రూ. 6,929 కోట్లు , బీసీల కసోం రూ. 38,605 కోట్లు, కాపు సంక్షేమానికి రూ. 4,887 కోట్లు కేటాయించింది.
Also Read : ప్రజా పక్షం సమస్యలపై యుద్దం