US Supreme Court : అబార్ష‌న్ హ‌క్కుల ర‌ద్దుపై ఆగ్ర‌హం

ఇది చీక‌టి దిన‌మ‌ని ప్ర‌పంచ నేత‌ల ఆవేద‌న

US Supreme Court : అమెరికా దేశ అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు(US Supreme Court) తీసుకున్న నిర్ణ‌యంపై అమెరికా భ‌గ్గుమంటోంది. గ‌త కొంత కాలం నుంచి మ‌హిళ‌ల‌కు సంబంధించి అబార్ష‌న్ (గ‌ర్భ‌స్రావం) కు రాజ్యాంగ ర‌క్ష‌ణ క‌ల్పించే చ‌ట్టానికి మంగ‌ళం పాడింది.

దీనికి చెక్ పెడుతూ ర‌ద్దు చేస్తున్న‌ట్లు తీర్పు చెప్పింది. దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. మ‌హిళ‌లు, హ‌క్కుల సంఘాలు, వివిధ దేశాల‌కు చెందిన నాయ‌కులు, మేధావులు, స్త్రీవాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మ‌రికొంద‌రు రోడ్ల‌పైకి వ‌చ్చారు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్ష చూపుతుంద‌నేందుకు ఇది ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు. అమెరికా దేశ చ‌రిత్ర‌లో ఇది చీక‌టి అధ్యాయంగా ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా పేర్కొన్నారు.

50 ఏళ్ల కింద‌ట మ‌హిళ‌ల‌కు అబార్ష‌న్ కు సంబంధించి జారీ చేసిన ఉత్త‌ర్వును ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు(US Supreme Court) తాజాగా జారీ చేసింది. దీంతో అమెరికా వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. న్యాయ‌స్థానానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు మహిళ‌లు.

ఈ తీర్పుతో దేశంలోని ప‌లు రాష్ట్రాలు అబార్ష‌న్ పై నిషేధం విధించేందుకు మార్గం సుగ‌మ‌మైంది. అబార్ష‌న్ ను చ‌ట్ట‌బ‌ద్దం చేసిన 1973 నాటి మైలు రాయి నిర్ణ‌యానికి పూర్తిగా చెక్ పెట్టిన‌ట్ల‌యింది.

ఇది అమెరికాకు పూర్తిగా విచార‌క‌ర‌మైన రోజుగా అభివ‌ర్ణించారు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్. ఈ ఒక్క తీర్పు వ‌ల్ల మ‌హిళ‌ల ఆరోగ్యం, జీవితం ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇది అమెరికా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా పేర్కొన్నారు బ‌రాక్ ఒబామా.

Also Read : అబార్ష‌న్ హ‌క్కుల ర‌ద్దు దేవుడి తీర్పు – ట్రంప్

Leave A Reply

Your Email Id will not be published!