Anil Kumar Yadav : లోకేష్..దమ్ముంటే నాపై పోటీకి దిగు
సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav : ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. నిన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి కి ఛాలెంజ్ విసిరారు. కానీ ఉన్నట్టుండి ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. దమ్ముంటే నెల్లూరు సిటీ వేదికగా బరిలోకి దిగాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపును ఆపగలిగే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు.
నీకు ఖలేజా ఉంటే , సత్తా ఉంటే దమ్ముంటే దా అని నారా లోకేష్ కు సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav). ఒకవేళ తనను గనుక ఓడిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అదే సమయంలో తాను గనుక విజయం సాధిస్తే నారా లోకేష్, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పు కోవాలని అన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ , వామపక్ష పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగినా తమను ఎదుర్కొనే సత్తా లేదన్నారు మాజీ మంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు , కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు దక్కిందన్నారు. నాడు నేడు పథకం దేశానికే గర్వ కారణంగా నిలిచిందని పేర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ