Anil Kumar Yadav : దమ్ముంటే దా లోకేష్ – అనిల్ కుమార్
తిరుమల కొండపై ప్రమాణానికి సిద్దం
Anil Kumar Yadav : ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. నువ్వా నేనా అంటూ మాటల యుద్దం కొనసాగుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి మధ్య మాటలు తారా స్థాయికి చేరుకున్నాయి. తనపై నిరాధార ఆరోపణలు చేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav). నీకు గనుక దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీకి దిగాలని సవాల్ చేశారు. ఆపై తాను తన తండ్రి సంపాదించిన ఆస్తుల కన్నా ఒక్క రూపాయి ఎక్కువగా సంపాదించినట్లు లేదా వెనకేసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆరు నూరైనా , ఎన్ని కుట్రలు , కుతంత్రాలు పన్నినా తనను ఓడించడం టీడీపీ చేత కాదని సవాల్ విసిరారు. అరువు తెచ్చుకున్న వారిని పక్కన పెట్టుకుని మాట్లాడినంత మాత్రాన నువ్వు తోపు లీడర్ అనుకుంటే పొరపాటు పడినట్లేనని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
లోకేష్..నువ్వు చేసిన ప్రతి ఆరోపణకు తాను సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనపై చేసిన చవక బారు విమర్శలకు ఏ దేవుడు క్షమించడన్నారు. కార్పొరేట్లు లే అవుట్లు వేస్తే దాన్ని కూడా తానే వేసినట్లు ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు అనిల్ కుమార్ యాదవ్.
Also Read : Raj Thackeray Pawar : మరాఠా పరిణామాల వెనుక పవార్
