Anil Kumar Yadav : ఆనం దమ్ముంటే నాపై పోటీకి దిగు
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav : ఏపీలో రాజకీయం మరింత రాజుకుంది. నేతల మాటల తూటాలు పేల్చుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరి ఎమ్మెల్యే, వైసీపీ రెబల్ నాయకుడు ఆనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీమే సవాల్ దమ్ముంటే టికెట్ తెచ్చుకో, నాపై పోటీకి దిగు చూడు తెలుస్తుంది ఏమిటో అని సవాల్ విసిరారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు లోకేష్ పాదయాత్రతో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. మీకు అంత సీన్ లేదన్నారు అనిల్ కుమార్ యాదవ్.
ఆదివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిష్మాతో గెలిచి పార్టీకి రాజీనామా చేయకుండా ఉండడానికి సిగ్గు ఉండాలన్నారు. నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము నీకు ఉందా అని ప్రశ్నించారు. లోకేష్ చేత టికెట్ కన్ ఫర్మ్ చేసుకో అన్నారు. ఒకవేళ నేను గెలిస్తే పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. ఒకవేళ తాను ఓడి పోతే ఇక రాజకీయాలకు రాం రాం చెబుతానని స్పష్టం చేశారు అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav).
నీ రాజకీయం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే నీ కెరీర్ కు పుల్ స్టాప్ పెడతా అంటూ హెచ్చరించారు మాజీజ మంత్రి. నెల్లూరు సిటీని ఎంత అభివృద్ది చేశానో..టీడీపీ ఎంత ఖర్చు చేసిందో చర్చకు తాను సిద్దమని ప్రకటించారు. దమ్ముంటే నువ్వు వస్తావో నీ బాబును తెచ్చుకుంటావో దా అన్నారు.
Also Read : Russia Civil War : రష్యాలో అంతర్యుద్ధం