Anna Hazare : మద్యం పాలసీపై అన్నా హజారే కామెంట్స్
లోక్ పాల్..లోకాయుక్తను మరిచి పోయారు
Anna Hazare : సామాజిక ఉద్యమకారుడు, ప్రముఖ పర్యావరణ యోధుడు అన్నా హజారే(Anna Hazare) షాకింగ్ కామెంట్స్ చేశారు. లోక్ పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు.
ఆయన సారథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ , యోగేంద్ర యాదవ్ లాంటి నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత యోగీంద్ర యాదవ్ కేజ్రీవాల్ తో పొసగక విడిపోయారు.
ఆనాటి ఉద్యమంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తామని ప్రకటించారు కేజ్రీవాల్. కానీ ఢిల్లీలో కొలువు తీరాక మాటలు మార్చారరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కు సుదీర్ఘ లేఖ రాశారు.
పనులకు భిన్నమైన మాటలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. అంతే కాదు ఢిల్లీ ప్రభుత్వం నుండి తాను ఇలాంటి విధానాన్ని ఆశించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్నా హజారే.
దశాబ్దం కిందట అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా ప్రాముఖ్యత పొందారు ఆయన. ఇప్పుడు మద్యం పాలసీపై పలు ప్రశ్నలు లేవనెత్తారు అన్నా హజారే(Anna Hazare).
రెండు పేజీల లేఖలో లోక్ పాల్ ఉద్యమాన్ని గుర్తు చేశారు. ప్రజలు డబ్బు, అధికారానికి సంబంధించిన దుర్మార్గపు చట్రంలో ఇరుక్కున్నట్లు కనిపిస్తోందన్నారు.
అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన లోక్ పాల్ , లోకాయుక్తలను మీరు సీఎం అయ్యాక మరిచి పోయారంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో దీని గురించి చర్చే లేకుండా చేశారన్నారు.
Also Read : సీబీఐ సోదాలలో దొరకని ఆధారాలు