Anna Hazare : అన్నా హజారే మన కాలపు గాంధీ. ఒక రకంగా చెప్పాలంటే అత్యంత సాధారణమైన జీవితం గడుపుతున్న సామాజిక కార్యకర్త. పర్యావరణం కోసం , దేశం కోసం నిత్యం పోరాడుతున్న అరుదైన వ్యక్తి అన్నా హజారే(Anna Hazare). అవినీతిపై యుద్దాన్ని ప్రకటించి, కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేసేలా తనను తాను మల్చుకున్న నాయకుడు.
అన్నా పిలుపు ఇస్తే వేలాది మంది జనం స్వచ్చంధంగా తరలి వస్తారు. ప్రస్తుతం దేశం యావత్తు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి పోయింది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా దానిని కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు కంట్రోల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే ద్రవ్యోల్బణం ప్రమాదకర స్థాయిని దాటింది. అచ్చే దిన్ అంటూ ప్రకటించిన నినాదం ఇవాళ సచ్చే దిన్ లాగా మారిందని జనం గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. డిజిటలైజేషన్ జపం చేస్తున్నారే తప్పా బతుకు దెరువు కోసం కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి అన్నా హజారే తన మౌనాన్ని వీడాలని, జనం తరపున తన గొంతుక వినిపించాలని కోరుతున్నారు.
Also Read : Mohammed Zubair : బెదిరించడం ప్రజాస్వామ్యమా – జుబేర్
