Anna Lezhneva: తిరుమల శ్రీవారి సేవకు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా
తిరుమల శ్రీవారి సేవకు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా
Anna Lezhneva : సింగపూర్ లోని ఓ స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద ఘటన గురించి తెలియగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భార్య అన్నాలెజినోవా(Anna Lezhneva)… తన కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మ్రొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మార్క్ శంకర్ ను… పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. దీనితో శ్రీవారికి వెళ్లి మొక్కు తీర్చుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నాలేజినోవా ఆదివారం తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
అనంతరం ఆమెకు కేటాయించిన గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో ఆమె డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ఆమె శ్రీభూవరహా స్వామివారిని దర్శించుకుని…. కళ్యాణ్ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కు తీర్చుకున్నారు. సోమవారం ఉదయం ఆమె శ్రీవారిని ఆమె దర్శించుకోనున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి అన్నాలెజినోవా మొక్కులు చెల్లించుకోనున్నారు.
Anna Lezhneva – అసలు ఏం జరిగిందంటే ?
సింగపూర్‌లో(Singapore) ఏప్రిల్ 8వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar) గాయపడ్డారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీంలోని రివర్ వ్యాలీ రోడ్డులో గల మూడంతస్తుల భవనంలో టమాటో కుకింగ్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలలోనే మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూలులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు కొంతమంది విద్యార్థులు గాయల బారిన పడ్డారు. దీనితో అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మార్క్ శంకర్ ను కాపాడారు. అగ్ని ప్రమాదం జరగడంతో స్కూలులో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీనితో మార్క్ శంకర్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. అలాగే ప్రమాదం వల్ల మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
బాబును ఈ ప్రమాదం నుంచి రక్షించి సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు సమాచారం అందించారు. ఈ సమయంలో అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నపవన్… పర్యటన ముగించుకున్న అనంతరం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుండి సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఆస్పత్రికి చేరుకుని అక్కడ మార్క్‌శంకర్ ను పవన్ పరామర్శించారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ సింగపూర్ ఆస్పత్రిలో ఉన్నారు. బాబు కోలుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మార్క్ శంకర్‌ను అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారికి పవన్ ప్రత్యేకంగా అభినందించారు. వారికి సన్మానం చేశారు. భార్య అన్నాలెజినోవా కుమారుడు మార్క్ శంకర్‌తో తిరిగి పవన్ కల్యాణ్ హైదరాబాద్ కి వచ్చారు.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. సింగపూర్‌లో తన కుమారుడు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్‌లో ఉన్నారని… ఆ సమయంలో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదం తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రార్థనలు, ఆందోళన, మద్దతు తనను ఉక్కిరిబిక్కిరి చేశాయని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ సభ్యులు, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుందని… బాగా కోలుకుంటున్నారని చెప్పారు. అందరికీ హృదయపూర్వక సందేశాలు, తమకు నిజంగా బలాన్నిచ్చాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read : Lift Accident: లిఫ్ట్ ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్ మృతి