CBI Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్
అదుపులోకి తీసుకున్న సీబీఐ
CBI Arrest : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం స్కాంలో మరొకరిని అదుపులోకి తీసుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఇప్పటికే పలుమార్లు దేశంలోని పలు ప్రాంతాలలో దాడులు చేపట్టింది. సోదాలు నిర్వహించింది.
ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కొలువు తీరాక ఆప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై విచారణకు ఆదేశించారు. అందులో భాగంగానే లిక్కర్ స్కాంపై విచారణకు ఆదేశించారు. దీంతో సీబీఐ(CBI Arrest) రంగంలోకి దిగింది.
ఈ మేరకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 14 గంటల పాటు విచారించింది. ఆపై మనీష్ సోసిడియాతో పాటు 14 మందిపై అభియోగాలు మోపింది. ఇదే సమయంలో హైదరాబాద్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమినాడు, తదితర రాష్ట్రాలలో విస్తృతంగా దాడులు చేపట్టింది ఈడీ.
తాజాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో మరొకరిని సోమవారం అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఇవాళ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన జీఎన్సీటీడీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అవకతవకలు , అమలుకు సంబంధించిన కేసు విచారణలో అభిషేక్ బోయిన్ పల్లిని సీబీఐ అరెస్ట్(CBI Arrest) చేసింది.
అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిఆరు. విచారణ కొనసాగుతోందని పేర్కొంది. ఇక ఈ కేసులో మొదటగా ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ మాజీ సిఇఓ , వ్యాపారవేత్త విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది.
రెండో అరెస్ట్ మద్యం పంపిణీదారు ఇండో స్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రుడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ కవితకు , ఎంపీ సంతోష్ కుమార్ కు దగ్గరగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాస్ రావును అరెస్ట్ చేసింది.
Also Read : ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు