BL Santosh : బీఎల్ సంతోష్ కు మ‌రోసారి నోటీసు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు

BL Santosh : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది హైద‌రాబాద్ లోని మోయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఈ కేసుకు సంబంధించి ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు ఆత్మీయుడిగా పేరొందిన ఆర్ఎస్ఎస్ కీల‌క నేత బీఎల్ సంతోష్(BL Santosh) కు షాక్ త‌గిలింది.

ఆయ‌న గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేల కేసులో బీఎల్ సంతోష్ నిందితుడిగా ఉన్నారంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసులు గురువారం వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఈ కేసుకు సంబంధించి హాజ‌రు కావాల్సిందిగా బీఎల్ సంతోష్ కు నోటీసు పంపించారు.

కానీ ఆయ‌న స్పందించ లేదు. ఈ కేసు హైకోర్టులో న‌డుస్తోంది. ఆయ‌న‌కు ఇ మెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా నోటీసుకు సంబంధించి స‌మాచారం అందించాల‌ని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా రెండోసారి నోటీసు జారీ చేసిన‌ట్లు ఖాకీలు వెల్ల‌డించారు.

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసుల ముందుకు హాజ‌రు కాలేదు. న‌లుగురు తెలంగాణ రాష్ట్ర స‌మ‌మితి పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాల‌రాజు, బీరం హ‌ర్ష వ‌ర్ద‌న్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రేగా కాంతారావుల‌ను కొనుగోలు వ్య‌వ‌హారం వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌లో బీఎల్ సంతోష్(BL Santosh) పేరును నిందితులు పేర్కొన‌డంతో నోటీసు జారీ చేశారు తెలంగాణ పోలీసులు.

ఇదిలా ఉండ‌గా ఈ కుట్ర కేసులో బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు బీఎల్ సంతోష్ తో పాటు మ‌రో ముగ్గురిని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్ ) నిందితులుగా చేర్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఓ వైపు కేంద్రం రాష్ట్రానికి చెందిన మంత్రిపై దాడులు చేస్తే కేంద్రానికి చెందిన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడిని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తోంది రాష్ట్ర స‌ర్కార్.

Also Read : బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం – ఆర్ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!