Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మరో సంచలన అప్డేట్
Tirumala : తిరుమల లడ్డు వ్యవహారంపై త్వరలో విచారణ జరగనుంది. సీబీఐ నియమించిన బృందానికి సహాయపడేందుకు అదనంగా సిబ్బంది కావాలని అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ అనుమతి తీసుకుని మరి కొంతమంది పోలీస్ అధికారులను, సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ 5 గురు అధికారులను నియమించారు.
Tirumala Laddu Issue..
సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ ఏస్ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ట త్రిపాటి, విశాఖ రేంజ్ DIG జెట్టి గోపీనాథ్, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, FSSAI సలహాదారుడు డాక్టర్ సత్య కుమార్ పండా లను సీబీఐ నియమించింది. ఈ బృందం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తుందని సీబీఐ పేర్కొంది. అయితే, సీబీఐ నియమించిన బృందానికి మరి కొంతమంది అధికారులు, ఇతర స్టాఫ్ కావాలని అధికారులు కోరారు.
Also Read : CM Revanth Reddy : యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయ అభివృద్ధిపై సీఎం కీలక నిర్ణయం