Anurag Kashyap : అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్
రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ పై
Anurag Kashyap : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది ప్రముఖ బాలీవుడ్ నటుడు, దీపికా పదుకొనే భర్త రణ్ వీర్ సింగ్ చేసిన నిర్వాకం. ఆయన పూర్తిగా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం న్యూడ్ (నగ్నం) ఫోటో షూట్ చేశాడు.
ఎలాంటి నూలు పోగు అన్నది లేకుండా ఫోటోలు దిగాడు. ఆపై తన ఇన్ స్టా గ్రామ్ లో దానిని షేర్ చేశాడు. పెద్ద ఎత్తున లైక్ లు, కామెంట్లు వచ్చాయి.
ఆపై విమర్శలు కూడా ఉన్నాయి. కాగా బాలీవుడ్ కు చెందిన కొందరు అతడిని ఎంకరేజ్ చేశారు. వారిలో నటి జాన్వీ కపూర్ కూడా ఉన్నారు. ఈ
తరుణంలో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.
ఇంకెందుకు న్యూడ్ ఫోటోలు దిగడం..పోర్న్ లో నటిస్తే బెటర్ కదా అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇలా దిగుతూ ఈ నటుడు సభ్య
సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడంటూ ఓ న్యాయవాది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇక రణ్ వీర్ కంటే ముందు రౌడీ హీరో విజయ్ దేవర కొండ సైతం 90 శాతం న్యూడ్ గా లైగర్ మూవీ
ప్రమోషన్ కోసం దిగాడు. అది వైరల్ అయ్యింది.
ఆపై రాహుల్ ఖన్నా పూర్తిగా నగ్నంగా దిగాడు. ఆ తర్వాత కోలీవుడ్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల భర్త విశాల్
కన్నా న్యూడ్ గా దిగాడు. ఈ ఫోటోల్ని గుత్తా జ్వాల తీయడం కలకలం రేపింది.
తాజాగా రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ పై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) సీరియస్ గా స్పందించాడు. ఇది తనకు
ఆనందం కలిగిస్తుందేమో కానీ తన ఆత్మ విశ్వాసం దెబ్బ తీసిందని పేర్కొన్నాడు.
భారతీయ పురుషుల ఆత్మ విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేసిందంటూ మండిపడ్డాడు.
Also Read : కంటెంట్ లో దమ్ముంటే సక్సెస్ ఖాయం