Anurag Thakur : మహిళా సంఘాలకు డ్రోన్లు
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
Anurag Thakur : న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా న్యూ టెక్నాలజీని వాడనుందని పేర్కొంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాల గురించి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Anurag Thakur Announced New Schemes
మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. 2023-24 నుంచి 2025-26 మధ్య కాలంలో 15 వేల మహిళా సంఘాలకు డ్రోన్లను దశల వారీగా ఇస్తామన్నారు. వ్యవసాయానికి రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందజేస్తామని, ఉపాధి పొందేలా స్కీమ్ ను తయారు చేశామన్నారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
డ్రోన్లు అందించే పథకం కోసం రూ. 1,261 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 8 లక్షల మేర 80 శాతం ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). 2023-24లో రబీ సీజన్ కోసం ఎరువులపై సబ్సిడీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్రంపై రూ. 22,303 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నారు.
Also Read : Telangana Governor : ఓటు వేయండి డెమోక్రసీని రక్షించండి